Illu illalu pillalu : శ్రీవల్లికి షాకిచ్చిన విశ్వ.. అమూల్య పెళ్ళిచూపులు జరుగుతాయా!
on Jan 6, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -360 లో.....ఇంట్లో గోడవ జరిగింది కదా.. ఆ మూడ్ నుండి బయటకి రావడానికి శ్రీవల్లి అందరిని హాల్లోకి పిలుస్తుంది. అందరం సరదాగా అంత్యాక్షరి ఆడుకుందామని అంటుంది. దాంతో ఎందుకు ఇప్పుడు అదంతా అని వేదవతి అంటుంది. అయిన వినకుండా స్లిప్స్ లో అక్షరం రాసి ఒక దాంట్లో వేసి తిరుపతికి ఇస్తుంది. అందులో తిరుపతి ఒక్కొకటిగా తీస్తాడు.
మొదట శ్రీవల్లి ఆ తర్వాత నర్మద, ప్రేమ వాళ్ళకి వస్తుంది. రామరాజు కూడా ఒక పాట పాడుతాడు. అలా ఇల్లంతా సందడిగా మారుతుంది. అప్పుడే భాగ్యం, ఆనందరావు ఇద్దరు వస్తారు. మీరు ఎందుకు వచ్చారని శ్రీవల్లి వాళ్లపై కోప్పడుతుంది. వాళ్ళని బయటికి తీసుకొని వెళ్లి ఎందుకు వచ్చారని అడుగుతుంది. దాంతో విశ్వ నుండి ఇద్దరు తప్పించుకోబోతుంటే వాళ్ళకి ఎదురుగా విశ్వ వస్తాడు. మీరు అమూల్య పెళ్లిచూపులు ఆపకుంటే మిమ్మల్ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన విషయం ఇద్దరు శ్రీవల్లికి చెప్తారు.
అలా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే ఇంటి పైనుండి విశ్వ చూస్తాడు. అతడిని చూసి వాళ్లు ఇంకా భయపడుతారు. మరొకవైపు అమూల్యకి పెళ్లిచూపులని వేదవతి కంగారుపడుతూ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఆ తర్వాత తిరుపతి తన అతిలోక సుందరితో ఫోన్ మాట్లాడుతుంటే సాగర్,చందు, ధీరజ్ వచ్చి.. మావ నిన్ను చూస్తుంటే ఎక్కడో బోర్లా పడుతావపిస్తుందని తనని ఆటపట్టిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



